
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీకి ఎస్సీ లేదా ఎస్టీకి చెందిన నేతను అధ్యక్షుడిగా ప్రకటించాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. బుధవారం గాంధీ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. రేవంత్ రెడ్డి మరో పదేండ్ల పాటు సీఎంగా కొనసాగాలని ప్రజలు కోరుకుంటున్నారని, బీఆర్‌ఎస్ నేతలు మాత్రం కేసీఆర్‌ను సీఎంగా ప్రజలు కోరుకుంటున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్.. బీజేపీ కూటమిగా ఏర్పడి పోటీ చేస్తాయని చెప్పారు.