
- నిర్మాణ పనులను దక్కించుకున్న బీహెచ్ఈఎల్
- రూ.6,700 కోట్ల వ్యయంతో 800 మెగావాట్ల యూనిట్
- సర్కార్ దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటుకు కృషి చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- అందుబాటులోకి వస్తే.. సింగరేణికి ఇన్ కమ్.. నిరుద్యోగులకు ఉపాధికి చాన్స్
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) విస్తరణలో భాగంగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ మూడో యూనిట్ప్లాంట్ రానుంది. రూ.6,700 కోట్లతో నిర్మించే మూడో ప్లాంట్పనులను భారత్ హెవీ ఎలక్ర్టికల్స్ లిమిటెడ్(భెల్) దక్కించుకుంది. తొమ్మిదేండ్ల నిరీక్షణ తర్వాత ఎస్టీపీపీలో మూడో ప్లాంట్నిర్మాణానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది. కొత్త ప్లాంట్ తో సింగరేణి సంస్థకు ఇన్ కమ్ తో పాటు వేలమంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు వచ్చే వీలుంది. ఎస్టీపీపీ ఏర్పాటులో కాకా కుటుంబం కృషి ఎంతో ఉంది. మూడో యూనిట్ కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి చొరవ చూపారు.
తొమ్మిదేండ్ల నిరీక్షణ తర్వాత..
ఎస్టీపీపీలో 1,200 రెండు యూనిట్ల(600×2 ) ద్వారా పవర్ఉత్పత్తి జరుగుతుంది. మరో 600 మెగావాట్ల ప్లాంట్నిర్మాణానికి 2015 మార్చిలో అప్పటి సీఎం కేసీఆర్శంకుస్థాపన చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణలో భాగంగా సూపర్క్రిటికల్విధానంలో 800 మెగావాట్ల ప్లాంటు ఏర్పాటుకు పర్మిషన్ ఇచ్చింది. కాగా.. టెండర్ల ప్రక్రియ జాప్యంతో 9 ఏండ్లుగా నిరీక్షణ తప్పలేదు. 2022లో 800 మెగావాట్ల ప్లాంట్ కు టెండర్లు పిలువగా పలు సంస్థలు అంచనా వ్యయం కంటే ఎక్కువగా కోట్‌చేయడంతో రద్దు చేశారు. గతేడాది మళ్లీ టెండర్లు పిలిచారు. ఎట్టకేలకు శుక్రవారం 800 మెగావాట్ల మూడో యూనిట్నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్(భెల్)సంస్థకు ఆర్డర్‌ఇచ్చింది. రూ.6,700 కోట్ల విలువైన పనుల్లో డిజైన్, ఇంజనీరింగ్, మాన్యుఫ్యాక్చరింగ్, సప్లయ్, సివిల్‌వర్క్స్ వంటివి సంస్థ చేపట్టనుంది.
మూడు నెలల్లో పనులు షురూ
సింగరేణి బిజినెస్ ప్రధానంగా గనుల్లో బొగ్గు తవ్వి థర్మల్విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అమ్ముతుంది. విద్యుత్ ఉత్పత్తి ద్వారా అధిక లాభాలు వస్తుండడంతో సంస్థ ఆ దిశగా దృష్టి సారించింది. సొంతంగా బొగ్గు అందుబాటులో ఉండడంతో ఇప్పటికే జైపూర్‌లో 1,200 మెగావాట్ల రెండు థర్మల్యూనిట్లను ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. వందశాతం ప్లాంట్లోడ్ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్) సాధిస్తూ దేశంలోనే రికార్డులు సృష్టిస్తోంది. రాష్ట్ర విద్యుత్ అవసరాల్లోనూ12 శాతం ఎస్టీపీపీనే తీరుస్తోంది. గత ఐదేండ్లలో ఏకంగా 60,521 మిలియన్‌యూనిట్ల కరెంట్‌ను ఉత్పత్తి చేసి స్టేట్ గ్రిడ్‌కు సప్లై చేసింది. కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్‌కు ఎస్టీపీపీలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అవసరమైన బొగ్గు సింగరేణి యూజీ, ఓసీపీ గనులు, శ్రీరాంపూర్ సీహెచ్‌పీ నుంచి బొగ్గు రవాణాకు రైల్వే ట్రాక్‌లైన్ ను వినియోగించుకోనుంది. ఏటా 4 మిలియన్ టన్నుల బొగ్గు కావాల్సి ఉంటుంది. ఇప్పటికే 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు షెట్పల్లి గోదావరి నది నుంచి 1 టీఎంసీ, కోటపల్లి మండలం దేవులవాడ వద్ద ప్రాణహిత నది నుంచి 2 టీఎంసీల నీటిని తీసుకుంటోంది. ఇదే నీటిని షెట్పల్లి వద్ద నిర్మించిన రిజర్వాయర్ నుంచి కొత్త మూడో ప్లాంట్‌కు సరఫరా చేస్తారు. ఎస్టీపీపీలోనే మరో చోట నిర్మిస్తుండగా కొత్తగా భూసేకరణ అవసరం లేదు. -127 హెక్టార్ల స్థలంలో ప్లాంటును నిర్మిస్తారు. మూడు నెలల్లో ప్లాంట్నిర్మాణ పనులు మొదలుపెట్టి 50 నెలల్లో పూర్తి చేసేలా సింగరేణి ప్లాన్ చేసుకుంది. త్వరలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా భూమిపూజ చేయించనున్నారు.
ప్లాంట్ ఏర్పాటుపై సర్కార్ దృష్టికి తీసుకెళ్లిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్
జైపూర్ఎస్టీపీపీ ఏర్పాటులో కాకా ఫ్యామిలీ కృషి ఎంతో ఉంది. 2005లో కాంగ్రెస్సర్కార్లో ఎస్టీపీపీ నిర్మాణం ప్రారంభించగా అప్పటి పెద్దపల్లి ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి, ఆయన కొడుకు అప్పటి రాష్ట్ర కార్మిక మంత్రి గడ్డం వినోద్తమ వంతు కృషి చేశారు. 2009 –2014 వరకు పెద్దపల్లి ఎంపీగా కాకా మరో కొడుకు, ప్రస్తుత చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్గడ్డం వివేక్‌వెంకటస్వామి ఎస్టీపీపీకి చొరవ చూపారు. ఇందుకు సుమారు 1,883 ఎకరాలను సేకరించారు. అప్పట్లో భూ నిర్వాసిత కుటుంబాలకు పర్మినెంటు జాబ్ లతో పాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్జాబ్ ల్లో 80 శాతం స్థానికులకు ఇస్తామని సింగరేణి నిర్లక్ష్యం చేసింది.
చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేక్‌వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి, సింగరేణి సీఎండీ బలరాంనాయక్దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం స్పందించి ఎస్టీపీపీలో 80శాతం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్జాబ్ లు స్థానికులకే చెందేలా జీవో జారీ చేసింది. మరోవైపు మూడో యూనిట్ఏర్పాటైతే నిరుద్యోగులకు పెద్ద సంఖ్యలో జాబ్ లు రావడంతో పాటు సింగరేణికి వందల కోట్ల ఇన్ కమ్ వస్తుందని పలుమార్లు వివేక్ వెంకటస్వామి అసెంబ్లీలోనూ ప్రస్తావిస్తూ ప్లాంట్ ఏర్పాటుకు సర్కార్‌పై ఒత్తిడి పెంచారు.