కింద్రాబాద్, వెలుగు: ఒడిశాలో రైళ్ల ప్రమాదం నేపథ్యంలో రైల్వే అధికారులు అప్రమత్తం అయ్యారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ బుధవారం సికింద్రాబాద్ డివిజన్‌లోని సికింద్రాబాద్ – వికారాబాద్ సెక్షన్ మధ్య తనిఖీ నిర్వహించారు.
సికింద్రాబాద్ నుంచి వికారాబాద్ వరకు లోకోమోటివ్ ద్వారా ట్రాక్స్, సిగ్నలింగ్ వ్యవస్థ భద్రతా అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. లోకో పైలట్లు అనుసరిస్తున్న భద్రతా విధానాలు, స్పీడో మీటర్, స్పీడో గ్రాఫ్, బ్రేక్‌లు, వాటి పనితీరును చెక్ చేశారు. వికారాబాద్ రైల్వే స్టేషన్‌లోని సౌకర్యాలను పరిశీలించారు. తనిఖీల్లో అరుణ్కుమార్జైన్తోపాటు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఏకే గుప్తా, ఇతర అధికారులు పాల్గొన్నారు.