స్టాక్ మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. ఐదో సెషన్లోనూ లాసే..!

స్టాక్ మార్కెట్లో కొనసాగుతోన్న నష్టాల పరంపర.. ఐదో సెషన్లోనూ లాసే..!
  • సెన్సెక్స్​ 200 పాయింట్లు డౌన్​
  • 73 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ

ముంబై: స్టాక్​మార్కెట్లు గురువారం ఉదయం లాభాల్లో కదలాడినా, చివరికి నష్టాలతో ముగిశాయి. వరుసగా ఐదో సెషన్​లోనూ పడ్డాయి. సెన్సెక్స్​ 200 పాయింట్ల నష్టంతో 73,828.91 పాయింట్లు వద్ద ముగిసింది. మొదట్లో ఇది 74,401.11 పాయింట్ల వరకు వెళ్లింది. అమ్మకాల ఒత్తిడి వల్ల నష్టపోయింది. నిఫ్టీ 73.30 పాయింట్ల నష్టంతో 22,397.20 వద్ద క్లోజయింది. సెన్సెక్స్ షేర్లలో జొమాటో, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్, మారుతి సుజుకి ఇండియా, అదానీ పోర్ట్స్, హిందూస్తాన్ యూనిలీవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌‌‌‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. 

ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్‌‌‌‌టీపీసీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, పవర్‌‌‌‌గ్రిడ్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సన్ ఫార్మా లాభపడ్డాయి. మొత్తం షేర్లలో 2,457 నష్టపోగా, 1,518 లాభపడ్డాయి. సెక్టోరల్​ ఇండెక్స్​లలో బ్యాంకెక్స్​, పవర్​ మాత్రమే లాభపడ్డాయి. ఎఫ్​ఐఐలు బుధవారం రూ.1,627.61 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, డీఐఐలు రూ.1,510.35 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. ఆసియా మార్కెట్లో టోక్యో, షాంఘై, సియోల్​ నష్టపోయాయి. యూరప్​ మార్కెట్లు మిడ్​సెషన్​లో లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ ​మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. హోలీ సందర్భంగా శుక్రవారం స్టాక్​మార్కెట్లు పనిచేయవు.