రూ.6 లక్షల కోట్లు ఆవిరి ..సెన్సెక్స్ 660 పాయింట్లు డౌన్​

రూ.6 లక్షల కోట్లు ఆవిరి ..సెన్సెక్స్ 660 పాయింట్లు డౌన్​
  • 80 వేల దిగువకు పతనం 
  • 219 పాయింట్లు తగ్గిన నిఫ్టీ

ముంబై: మార్కెట్ల పతనం వరుసగా ఐదవ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనూ కొనసాగింది. విదేశీ పెట్టుబడులు భారీగా తరలిపోవడం, రెండో క్వార్టర్​ ఫలితాలు మెప్పించకపోవడంతో అమ్మకాల ఒత్తిడి పెరిగి సూచీలు నేలచూపులు చూశాయి. ఈక్విటీ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సెన్సెక్స్ శుక్రవారం 660 పాయింట్లు పడిపోయి 80 వేల స్థాయి దిగువకు చేరింది.  రాజకీయ అనిశ్చితుల మధ్య అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం కూడా నష్టాలకు కారణమైంది.   బీఎస్ఈ సెన్సెక్స్ 663 పాయింట్లు క్షీణించి 79,402.29 వద్ద స్థిరపడింది. 

ఇంట్రాడేలో ఇది 927.18 పాయింట్లు  క్షీణించి 79,137.98 వద్దకు చేరుకుంది.  బీఎస్ఈలో  మొత్తం 3,101 స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు క్షీణించగా, 841 పెరిగాయి.   ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 219 పాయింట్లు తగ్గి 24,181 వద్దకు చేరుకుంది. వరుసగా నాలుగో వారం కూడా ఇండెక్స్ దిగువన ముగిసింది. ఈవారంలో బీఎస్ఈ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ 1,822.46 పాయింట్లు (2.24 శాతం),  నిఫ్టీ 673.25 పాయింట్లు ( 2.70 శాతం) పడిపోయింది. నిఫ్టీ శుక్రవారం రెండున్నర నెలల కనిష్ట స్థాయికి సమీపంలో ముగిసింది. దీంతో ఇన్వెస్టర్లు రూ.ఆరు లక్షల కోట్ల వరకు నష్టపోయారు.

ఇండస్​ ఇండ్ ​బ్యాంక్ ​షేర్లు 19 శాతం క్రాష్‌‌‌‌

30 సెన్సెక్స్ ప్యాక్​లో ఇండస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఇండ్ బ్యాంక్ ఘోరంగా నష్టపోయింది. సెప్టెంబర్ క్వార్టర్ ​లాభం 40 శాతం తగ్గడంతో షేరు 19 శాతానికి పైగా పడిపోయింది.  మహీంద్రా అండ్ మహీంద్రా, లార్సెన్ అండ్​ టూబ్రో, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీపీసీ, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, మారుతీ, బజాజ్ ఫైనాన్స్  టైటాన్ కూడా వెనకబడి ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలీవర్, సన్ ఫార్మా,  ఐసీఐసీఐ బ్యాంక్ లాభపడ్డాయి.   రెండవ క్వార్టర్​ఫలితాలు బాగుండటంతో ఐటీసీ షేరు రెండు శాతానికి పైగా పెరిగింది.  అమ్మకాల ఒత్తిడి,  బలహీన క్యూ2 ఫలితాలు, యూఎస్​ ట్రెజరీ ఈల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పెరగడంతో ఈ వారంలోని అన్ని రోజులూ భారతీయ మార్కెట్లు పడిపోయాయని ఎనలిస్టులు చెప్పారు. ఇదిలా ఉంటే,  బీఎస్ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ 2.44 శాతం క్షీణించగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 1.48 శాతం పడిపోయింది. 

 సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఎఫ్ఎంసీజీ మినహా అన్నీ నష్టపోయాయి.  ఆసియా మార్కెట్లలో సియోల్, షాంఘై,  హాంకాంగ్ లాభాల్లో స్థిరపడగా, టోక్యో నష్టాల్లో ముగిసింది.  యూరోపియన్ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిసింది.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు 0.42 శాతం పెరిగి 74.69 డాలర్లకు చేరుకుంది.  విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు) గురువారం రూ. 5,062.45 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా,  దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐలు) రూ. 3,620.47 కోట్ల షేర్లను కొన్నారు.

ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐ విక్రయాలు ఆగకపోవడంతో దేశీయ మార్కెట్లు నష్టపోతూనే ఉన్నాయి. ఎఫ్​ఎంసీజీ మినహా అన్ని రంగాలు శుక్రవారం పడ్డాయి. స్మాల్​, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కువగా నష్టపోయాయి. అయినప్పటికీ డీఐఐలు మాత్రం భారీగా పెట్టుబడులు పెట్టారు. దేశీయ మార్కెట్ ఓవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సోల్డ్ జోన్​కు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాం

 వినోద్ నాయర్ , జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్  ఎనలిస్ట్‌‌‌‌