సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్​

సెన్సెక్స్ 1200 పాయింట్లు డౌన్​
  • 80 వేల దిగువకు పతనం 
  • 360 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
  • ఇన్వెస్టర్లకు రూ.1.50 లక్షల కోట్లు లాస్​

ముంబై: ఈక్విటీ బెంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మార్క్ సూచీలు సెన్సెక్స్,  నిఫ్టీలు గురువారం ప్రారంభ లాభాలను కోల్పోయి దాదాపు 1.50 శాతం నష్టపోయాయి. గ్లోబల్ ఈక్విటీలలో నెగెటివ్​ ట్రెండ్స్​ వల్ల ఇన్ఫోసిస్, రిలయన్స్​, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో తీవ్రమైన అమ్మకాల ఒత్తిడి కనిపించింది. పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో ఐటీ, ఆటో,  కన్జూమర్ డ్యూరబుల్ స్టాక్స్​లో నష్టాలు వచ్చాయి. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బలహీనపడిందని విశ్లేషకులు తెలిపారు. 

ఫలితంగా సెన్సెక్స్ 1,190.34 పాయింట్లు  క్షీణించి 79,043.74 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో ఇది 1,315.16 పాయింట్లు తగ్గి 78,918.92 వద్దకు చేరుకుంది.  ఇన్వెస్టర్ల సంపద రూ.1,50,265.63 కోట్లు తగ్గి రూ.4,42,98,083.42 కోట్లకు (5.24 ట్రిలియన్ డాలర్లు) చేరింది.  ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ నిఫ్టీ 360.75 పాయింట్లు పతనమై 23,914.15 వద్ద స్థిరపడింది. యూఎస్​ మార్కెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అమ్మకాలు,  పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వల్ల ఏర్పడ్డ అనిశ్చితి కారణంగా కరెక్షన్​ వచ్చిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. 

అదానీ షేర్లకు లాభాలు

అదానీ టోటల్ గ్యాస్ దాదాపు 16 శాతం ఎగబాకడంతో 11 లిస్టెడ్ అదానీ గ్రూప్ సంస్థలలో ఐదు షేర్లు గురువారం లాభాల్లో ముగిశాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ స్టాక్స్ 10 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ 10 శాతం, అదానీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజెస్ 1.63 శాతం పెరిగాయి.  అదానీ పోర్ట్స్  మాత్రం 2.73 శాతం క్షీణించింది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టైటాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, రిలయన్స్ ఇండస్ట్రీస్  పవర్ గ్రిడ్ నష్టపోయాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రమే లాభపడింది. 

 బీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఈ స్మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ గేజ్ 0.41 శాతం పెరగగా, మిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం పడిపోయింది.  సెక్టోరల్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో  యుటిలిటీస్, ఆయిల్, గ్యాస్  రియల్టీ లాభపడ్డాయి.    ఆసియా మార్కెట్లలో  సియోల్,  టోక్యోలు లాభాల్లో షాంఘై,  హాంకాంగ్ నష్టాల్లో ముగిశాయి.  యూరోపియన్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.  ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐలు బుధవారం రూ.7.78 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.