మెదక్​లో కోడిపందాలు.. ఏడుగురిపై కేసు నమోదు

  • నగదు, పందెం కోళ్లు, బైక్​ స్వాధీనం

మెదక్​ టౌన్​, వెలుగు : పట్టణంలో కోడిపందాలు నిర్వహిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కేసు నమోదు చేశారు.  టౌన్​ సీఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం... మెదక్​ పట్టణంలోని దుర్గాకాలనీలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు  సమాచారం  అందడంతో  దాడులు నిర్వహించామన్నారు.

ఈ దాడుల్లో  ఏడుగురిని అదుపులోకి తీసుకోవడంతో పాటు... రూ.2,120 నగదు, రెండు పందెం కోళ్ళు,  ఒక   బైక్​,  నలభై  కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.   కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నాగరాజు తెలిపారు.