
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : రాష్ట్రంలో ఆరేండ్లుగా రూ. 8,258 కోట్ల ఫీజు బకాయిలు ఉన్నాయని, తక్షణమే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్ష్య, కార్యదర్శి ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు డిమాండ్ చేశారు. -భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) తెలంగాణ5 వ మహాసభలు ఖమ్మం జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు, 10 యూనివర్సిటీలు, 6 సెంట్రల్ యూనివర్సిటీల నుంచి 417 మంది స్టూడెంట్స్ ప్రతినిధులు హాజరయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుత విద్యారంగ పరిస్థితిపై 23 తీర్మానాలతో కార్యాచరణ చేపట్టనున్నట్టు నేతలు మీడియాకు తెలిపారు. రాష్ట్రంలోని హాస్టళ్లకు, గురుకులాలు, కేజీబీవీలకు సొంత బిల్డింగ్ లు నిర్మించాలని కోరారు. ఉన్నత విద్య కింద వర్గాలకు సరిగా అందడంలేదని పేర్కొన్నారు. వర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ జీవో 21 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరిట రెగ్యులర్ కోర్సులను తీసివేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.