
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ కాలనీలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కాలనీవాసులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువకుడిని కిందికి దిగాలని కోరారు. దాదాపు గంట పాటు యువకుడు స్తంభంపైనే ఉన్నాడు. చివరకు యువకుడికి నచ్చజెప్పిన పోలీసులు.. కాలనీ వాసుల సహకారంతో కిందికి దింపారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్ మండలం పెద్దరే వెళ్లి గ్రామానికి చెందిన కుమార్ గా గుర్తించారు. ఆ తర్వాత ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.