Delhi double murder case: ఢిల్లీ జంట హత్యల కేసులో ట్విస్ట్ ..స్కెచ్ ఏసింది మైనర్లే..

Delhi double murder case: ఢిల్లీ జంట హత్యల కేసులో ట్విస్ట్ ..స్కెచ్ ఏసింది మైనర్లే..

దేశ రాజధాని ఢిల్లీలో దీపావళి రోజు జరిగిన జంట హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఢిల్లాలో షాహదారాలో డబుల్ మర్డర్ కేసుపై డీసీపీ ప్రశాంత్ గౌతమ్ వివరాలు శుక్రవారం ( నవంబర్ 1) వెల్లడించారు. మృతులు ఆకాష్, రిషబ్, క్రిష్ లపై కాల్పులు జరిగాయి. ఈ జంట హత్యల కేసులో సూత్రధారులు బాలనేరస్థులేనని చెప్పారు. కాల్పుల్లో ఆకాష్, రిషబ్ మృతి చెందారు. 70వేల రూపాయల విషయంలో నిందితుడయిన మైనర్, మృతుడు ఆకాష్ మద్య వివాదం కారణంగానే ఈ హత్యలు జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు డీసీపీ చెప్పారు. 

ఢిల్లీలోని బీహారీ కాలనీలో నివాసముంటున్న ఆకాష్, అతని అల్లుడిని తుపాకీతో కాల్చి చంపారు దుండగులు. అప్పటివరకు వారంతా దీపావళి సంబరాల్లో ఆనందంగా గడిపింది ఆ కుటుంబం. స్వీ్ట్లు పంచుకున్నారు. ఇంటి ముందు టపాసులు పేల్చారు.ఇంతలో యమదూతల్లా ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వినయంగా నటిస్తూ వంగి పాదాలకు నమస్కారం చేశారు. మొక్కినట్టే మొక్క ఒక్కసారితా గన్ తో కాల్పులు జరిపారు. 

మృతుడు ఆకాష్‌, అతని కుమారుడు, మేనల్లుడు తమ ఇంటి బయట దీపావళి వేడుకల్లో నిమగ్నమై ఉండగా కాల్పులు జరిగిన క్షణాలను సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చారు.ఒకరు దిగి వారితో ఆకాష్ తో మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ తర్వాత తుపాకీ తీసి ఆకాష్‌పై కాల్పులు జరిపాడు.

 కాల్పులు జరిపిన తర్వాత ఘటనా స్థలం నుంచి పారిపోతుండగా ఆకాష్ అల్లుడు అడ్డుకోగా అతనిపై కూడా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పదేళ్ల బాలుడితోపాటు మరొకరికి గాయాలయ్యాయి. ఊహించని ఈ ఘటన తో అక్కడివారంతా షాక్ కు గురయ్యారు. తేరుకొని వారిని గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.  

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు కారణాలపై విచారణ మొదలుపెట్టారు. గతంలో ఆకాష్ కు ఇతరులతో ఉన్న వ్యక్తిగత కక్షలతో ఈ హత్యలకు కారణం అని పోలీసులు నిర్ధారించారు. బాధితులపై ఐదు రౌండ్లు కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆకాష్ కు అతని బంధువులకు మధ్య భూవివాదం ఉన్నట్లు అతని భార్య పోలీసులకు తెలిపింది. దాడి చేసిన వ్యక్తులను గుర్తించింది.