ఎంసీహెచ్​ఆర్డీ వైస్​ చైర్​పర్సన్​గా శాంతికుమారి

ఎంసీహెచ్​ఆర్డీ వైస్​ చైర్​పర్సన్​గా శాంతికుమారి
  • రిటైర్ అయిన వెంటనే బాధ్యతల స్వీకరణ

హైదరాబాద్, వెలుగు: సీఎస్ శాంతి కుమారికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త బాధ్యతలు అప్పగించింది. ఆమెను ఎంసీహెచ్​ఆర్డీ  వైస్ చైర్‌‌‌‌‌‌‌‌పర్సన్‌‌‌‌‌‌‌‌గా నియమించింది. సీఎస్‌‌‌‌‌‌‌‌గా శాంతి కుమారి రిటైర్ అయిన వెంటనే.. కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎంసీహెచ్ఆర్డీ డీజీగా కూడా ఆమె కొనసాగనున్నారు. 

1989 ఐఏఎస్ బ్యాచ్‌‌‌‌‌‌‌‌కు చెందిన శాంతి కుమారి తన సుదీర్ఘమైన కెరీర్‌‌‌‌‌‌‌‌లో అనేక కీలకమైన ప్రభుత్వ పదవులను చేపట్టారు. వివిధ జిల్లాలకు కలెక్టర్‌‌‌‌‌‌‌‌గా, ఇతర ముఖ్యమైన పరిపాలనా పదవులు కూడా నిర్వహించారు.