మెడికవర్‌‌‌‌‌‌‌‌లో షీ క్లినిక్స్‌‌‌‌ ప్రారంభం

మెడికవర్‌‌‌‌‌‌‌‌లో షీ క్లినిక్స్‌‌‌‌ ప్రారంభం
  • ప్రతి శనివారం ఉచిత గైనకాలజిస్ట్ కన్సల్టేషన్, క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ 

హైదరాబాద్‌‌‌‌: హైదరాబాద్‌‌‌‌లోని మెడికవర్‌‌‌‌‌‌‌‌ విమెన్‌‌‌‌ అండ్‌‌‌‌ చైల్డ్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌లో కార్పొరేట్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌, వారి కుటుంబ సభ్యుల కోసం షీ క్లినిక్స్‌‌‌‌ను ప్రారంభించారు. హ్యాష్‌‌‌‌ ట్యాగ్‌‌‌‌ మార్కెటింగ్‌‌‌‌ వ్యవస్థాపకురాలు గుల్నార్‌‌‌‌‌‌‌‌ విర్క్‌‌‌‌ కృష్ణ, చీఫ్‌‌‌‌ లీగల్‌‌‌‌ అండ్‌‌‌‌ కంప్లయన్స్‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌ ఇషా సిన్హా ముఖ్య అతిథులుగా పాల్గొని క్లినిక్‌‌‌‌ను ప్రారంభించారు. ప్రతి శనివారం ఉచిత గైనకాలజిస్ట్‌‌‌‌ కన్సల్టేషన్‌‌‌‌, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ స్క్రీనింగ్‌‌‌‌ టెస్ట్‌‌‌‌ చేస్తామని క్లినిక్‌‌‌‌ వ్యవస్థాపకులు తెలిపారు. 

అయితే, ఈ ఆఫర్‌‌‌‌‌‌‌‌ పొందేందుకు సంబంధిత కంపెనీ ఐడీ తీసుకురావాలన్నారు. ఏటా  ఒకసారి 30 శాతం డిస్కౌంట్‌‌‌‌తో ఆన్‌‌‌‌ ఆల్‌‌‌‌ ఇన్వెస్టిగేషన్స్‌‌‌‌, కాంప్లిమెంటరీ హెల్త్‌‌‌‌ చెక్‌‌‌‌ ప్యాకేజీ ఉంటుందన్నారు. అనంతరం గుల్నార్ విర్క్ కృష్ణ మాట్లాడుతూ, ఒత్తిడి, సరైన లైఫ్‌‌‌‌స్టైల్ లేకపోవడం వల్ల మహిళలకు పలు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని చెప్పారు. మహిళలు వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్స్‌‌‌‌ మహేశ్‌‌‌‌ దెగ్లూర్కర్, డాక్టర్ రవీందర్ రెడ్డి పరిగే,సెంటర్ హెడ్ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.