శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ 21కి వాయిదా

శిల్పా చౌదరి బెయిల్ పిటిషన్ 21కి వాయిదా

రంగారెడ్డి జిల్లా: కిట్టీ పార్టీలు, ఇన్వెస్టుమెంట్ పేరుతో ప్రముఖులను మోసం చేసి కోట్లు కొల్లగొట్టిన శిల్పా చౌదరి బెయిల్ పిటిసన్ ఈనెల 21కి వాయిదా పడింది. ఉప్పరపల్లి కోర్టులో శిల్పా చౌదరి బెయిల్ పిటీషన్ పై విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని శిల్పా చౌదరి తరపు న్యాయవాది పిటీషన్ వేయడంతో కోర్టు విచారణ జరిగింది. శిల్పా చౌదరి ని ఇప్పటికే మూడు సార్లు కస్టడీలోకి అనుమతి ఇచ్చిన కోర్టు తదుపరి విచారణను ఈనెల 21న మంగళవారానికి వాయిదా వేసింది. 

ఈనెల 14న నార్సింగ్ పోలీసులు చంచల్ గూడ జైలు నుంచి ఆమెను తీసుకెళ్లి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించిన అనంతరం ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచగా కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దాంతో శిల్పను తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే శిల్పా చౌదరి తరపు న్యాయవాదులు రెండు కేసులకు సంబంధించి బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో ఇవాళ విచారించిన ఉప్పర్ పల్లి కోర్టు తదుపరి విచారణ ఈనెల 21న మంగళవారానికి వాయిదా వేసింది. 

ఇవి కూడా చదవండి:

 

డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదు.. వేసుకున్న గుడిశెలను కూల్చేశారు

ఆస్పత్రిలో దారుణం..మహిళలకు వేసిన కుట్లు విడిపోయాయి

కత్రినా పెళ్లికి కాస్ట్లీ గిఫ్టులు