
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీసీ స్టడీ సర్కిల్స్, బీసీ స్టడీ సెంటర్లలో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పరీక్షలకు ఈ నెల 7వ తేదీ నుంచి కోచింగ్ స్టార్ట్ చేస్తామని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఆలోక్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం అభ్యర్థుల వెరిఫికేషన్ ప్రాసెస్ కొనసాగుతోందని చెప్పారు. ఆదివారం వెలుగు పేపర్‌లో ‘‘ఫ్రీ కోచింగ్ ఎప్పుడు’’ అనే హెడ్డింగ్‌తో పబ్లిష్ అయిన స్టోరీకి ఆయన స్పందించారు. ప్రస్తుతం గ్రూప్–1 అభ్యర్థులకు కోచింగ్ ప్రారంభించామని, 7 నుంచి సెకండ్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తామని పేర్కొన్నారు. అట్లనే అన్ని బీసీ స్టడీ సర్కిళ్లలో ఆఫ్‌లైన్ తరగతులతో పాటు, ఆన్‌లైన్ క్లాస్‌లను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని బీసీ స్టడీ సర్కిల్స్‌లో నాణ్యమైన కోచింగ్‌ను అందిస్తున్నామని, ఈ విషయంలో బీసీ స్టడీ సర్కిల్ పూర్తి నిబద్ధతతో పని చేస్తోందని ఆలోక్ కుమార్ చెప్పారు.