
సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జాక్ - కొంచెం క్రాక్’. గురువారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత నాగవంశీ, దర్శకులు చందూ మొండేటి, కార్తీక్ దండు, కళ్యాణ్ శంకర్ అతిథులుగా హాజరై బెస్ట్ విషెస్ చెప్పారు. హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘టిల్లు స్క్వేర్’ తర్వాత అదే మీటర్‌లో ఉంటూ కథ మాత్రం కొత్తగా ఉండే సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో ‘జాక్’ కథ విన్నాను. ఇది పర్ఫెక్ట్ అనిపించింది. ‘బేబీ’ చూశాక మా సినిమాలో హీరోయిన్ వైష్ణవి అని ఫిక్స్ అయ్యాం. దర్శకుడు భాస్కర్ ‘టిల్లు’లోని కామెడీ టైమింగ్‌ను ఇందులో మిస్ అవకుండా కేర్ తీసుకున్నారు.
నాకెంతో ఫ్రీడమ్ ఇచ్చారు. ఈ చిత్రం ఎక్కడా ఎవ్వరినీ నిరాశపర్చకుండా రెండు వందల శాతం అందరికీ నచ్చుతుంది’ అని చెప్పాడు. ‘జాక్’ తన జీవితాంతం గుర్తుండిపోయే ప్రయాణమని హీరోయిన్ వైష్ణవి చైతన్య చెప్పింది. దర్శకుడు భాస్కర్ మాట్లాడుతూ ‘జాక్ అనేది మన అందరి కథ. ఒక రాయి, శిల్పానికి.. ఒక తాబేలు, కుందేలుకి.. ఓ ఎయిర్ బస్, ఎర్ర బస్సుకి మధ్య జరిగే కథ. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు. సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నట్టు నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ చెప్పారు.