ఎమెర్జెన్సీ వార్డు నుంచి మార్క్ శంకర్ ని షిఫ్ట్ చేసిన డాక్టర్లు.. ప్రమాదం తప్పినట్లే..

ఎమెర్జెన్సీ వార్డు నుంచి మార్క్ శంకర్ ని షిఫ్ట్ చేసిన డాక్టర్లు.. ప్రమాదం తప్పినట్లే..

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ (8) ఇటీవలే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడి హాస్పిటల్ లో చేరి ట్రీట్మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. అయితే మార్క్ శంకర్ ను చూసేందుకు పవన్ అన్న చిరంజీవి, వదిన సురేఖ తో కలసి సింగపుర్ చేరుకున్నాడు. 

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మార్క్ శంకర్ ని చూశానని త్వరగానే కోలుకుంటున్నాడని అలాగే ఎమెర్జెన్సీ వార్డు నుంచి జెనరల్ వార్డ్ కి షిఫ్ట్ చేసినట్లు తెలిపాడు. అయితే మొదట్లో తాను ఇది చిన్న ప్రమాదమే అనుకున్నానని.. కానీ ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ కి కాళ్ళు, చేతులకి గాయాలయ్యానని, పొగ పీల్చడం వల్ల కొంతమేర శ్వాస  తీసుకోవడానికి కొంతమేర ఇబ్బంది పడ్డాడని కానీ ఇప్పుడు పర్లేదని క్లారిటీ ఇచ్చాడు. అయితే గాయాల తీవ్రత తగ్గేవరకూ మరో 3 నుంచి 5 రోజులపాటూ హాస్పటల్ లోనే ఉండాలని వైద్యులు సూచించినట్లు తెలిపాడు.

Also Read:-లిటిల్ వారియర్, ధైర్యంగా ఉండు.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..

ఈ విషయం ఇలా ఉండగా మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్‌లోని రివర్ వ్యాలీలో ఉన్న ఓ పాఠశాలలో చదువుతున్నాడు. ఈ క్రమంలో  ఏప్రిల్ 8, 2025న పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం జరగ్గా మార్క్ శంకర్ పవనోవిచ్ తో పాటూ మరో 19 మంది స్టూడెంట్స్ గాయపడ్డారు. అలాగే మరో స్టూడెంట్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో సింగపూర్ పోలీసులు పాఠశాల యాజమాన్యంపై పలు సెక్షన్ల క్రింద కేసు నందుకు చేసి విచారిస్తున్నారు. అయితే ఈ ప్రమాదం ఘటన జరిగిన సమయంలో పవన్  ఆంధ్రప్రదేశ్‌లో అధికారిక పర్యటనలో ఉన్నాడు. అధికారుల ద్వారా మార్క్ శంకర్ విషయం తెలియగానే తన విధులను పూర్తి చేసుకున్న వెంటనే మంగళవారం రాత్రి సింగపూర్‌కు వెళ్లారు.