గుండెపోటుతో సింగరేణి యువ కార్మికుడి మృతి

గోదావరిఖని, వెలుగు: సింగరేణి ఆర్జీ 1 ఏరియా పరిధిలోని జీడీకే  2వ గనిలో కోల్​కట్టర్​ పనిచేసే గొల్లపల్లి నరేశ్ కుమార్ (32) శుక్రవారం గుండెపోటుకు గురై చనిపోయాడు.  యైటింక్లయిన్​ కాలనీలో నివాసముండే నరేశ్ కుమార్ యథావిధిగా జనరల్ షిప్ట్ డ్యూటీకి వచ్చి ఉదయం 7.05 గంటలకు హాజరు వేసుకున్నాడు.అనంతరం ఆకస్మాత్తుగా కిందపడ్డాడు.  

తోటి కార్మికులు, ఆఫీసర్లు అంబులెన్స్​ సింగరేణి ఏరియా హాస్పిటల్​కు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు.  తండ్రి రాయమల్లు సింగరేణిలో ఉద్యోగం చేయగా, డిపెండెంట్​కింద నరేశ్‌‌‌‌ కుమార్ కు మూడు సంవత్సరాల క్రితం  జనరల్​ మజ్దూర్​గా ఉద్యోగంలో  చేరాడు.  ఇటీవలే కోల్​ కట్టర్​గా ప్రమోషన్​ రాగా, శుక్రవారం నుంచే ఆయన ఆ డ్యూటీ చేయాల్సి ఉంది. నరేష్​ కుమార్​కు భార్య సంఘవి, తల్లిదండ్రులు రాయమల్లు, భాగ్య ఉన్నారు.