సింగరేణి వెల్ఫేర్ డిపార్ట్​మెంట్ సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్​

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు :  సింగరేణి కాలరీస్ వెల్ఫేర్ డిపార్ట్​మెంట్​లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాజశేఖర్​ను 10 రోజులపాటు సస్పెండ్ చేస్తూ యాజమాన్యం ఆదివారం ఆదే శాలు జారీ చేసింది. కొత్తగూడెంలో శనివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పర్యటించారు. 

ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలతో కలిసి కొత్తగూడెంలోని ఇల్లెందు క్రాస్ రోడ్డులో గల సింగరేణి గెస్ట్ హౌస్ లో రీ ఫ్రెష్​ అయ్యేందుకు వెళ్లారు. అక్కడి రూములు శుభ్రంగా లేకపోవడంపై మంత్రి సీరియస్​ అయ్యారు. ఆదివారం జీఎం పర్సనల్ తో మంత్రి మాట్లాడుతూ గెస్ట్ హౌస్ బాధ్యతలు చూసేవారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. దీంతో సీనియర్ అసిస్టెంట్​ను 10  రోజులు సస్పెండ్ చేయడంతో పాటు ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని యాజమాన్యం పేర్కొంది.