- స్ట్రక్చరల్ మీటింగ్‌లో వర్కర్స్ యూనియన్ నేతలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పీవీకే– 5 ఇంక్లైన్లో రెండు కొత్త ఎల్‌హెచ్‌డీ మెషీన్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ నేతలు యాజమాన్యాన్ని కోరారు. కొత్తగూడెం ఏరియాలోని జీఎం కాన్ఫరెన్స్ హాల్లో యూనియన్ నేతలతో సింగరేణి ఆఫీసర్లు సోమవారం నిర్వహించిన స్ట్రక్చరల్ మీటింగ్‌లో పలు అంశాలను నాయకులు ఆఫీసర్ల దృష్టికి తీసుకువచ్చారు. జేవీఆర్ ఓసీలోని బంకర్ల పగుళ్లపై చర్చించారు.
రుద్రంపూర్ హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. సర్ఫేస్ జనరల్ మజ్దూర్ల పోస్టులను కల్పించాలన్నారు. మహిళా ఉద్యోగులకు రెస్ట్ రూం, వాష్ రూం వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ ప్రోగ్రాంలో జీఎం షాలెం రాజు, వర్కర్స్ యూనియన్ నేతలు మల్లికార్జునరావు, గట్టయ్య, సుధాకర్‌తో పాటు పలువురు ఆఫీసర్లు పాల్గొన్నారు.