‘మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి’ అనే నినాదంతో మొన్న పెద్ద ఎత్తున మొక్కలు నాటించిన సింగరేణి కంపెనీ, కరెంట్తీగలకు అడ్డొస్తున్నాయంటూ నిన్న 15 నుంచి 20 భారీ వృక్షాలను నరికించింది.
సీఎం కేసీఆర్ సూచనలతో కోటి వృక్షార్చనలో భాగంగా సింగరేణి కంపెనీ డైరెక్టర్లు శనివారం కొత్తగూడెంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. కాగా కరెంట్ లైన్లకు అడ్డొస్తున్నాయనే కారణంతో ఆదివారం కొత్తగూడెం పరిధి రుద్రంపూర్ప్రాంతంలో భారీ వృక్షాలను కొట్టేయించారు. సింగరేణి అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
– వెలుగు, భద్రాద్రికొత్తగూడెం