
నస్పూర్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు సింగరేణి రెస్క్యూ టీం వెళ్లింది. గురువారం రాత్రి 11:-30గంటలకు సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం ఆదేశాల మేరకు శ్రీరాంపూర్ ఏరియా నుండి రెస్క్యూ ఆపరేషన్ లో సాయం చేయడానికి ఒక సంక్షేమ అధికారి, 40 ఉద్యోగులు, 1 సూపర్వైజర్, 1 సెక్యూరిటీ గార్డ్ తో బస్సులో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఏరియా జీఎం శ్రీనివాస్ మాట్లాడుతూ, శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి వెళ్లున్న వారికి అభినందనలు తెలిపారు.
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నేల్ వద్ద ఉన్న అధికారుల ఆదేశాల మేరకు రక్షణతో సహాయన్ని అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్వోటు జీఎం సత్యనారాయణ , ఏరియా రక్షణాధికారి శ్రీధర్ రావు, అధికారుల సంఘం శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు కే వెంకటేశ్వర్ రెడ్డి, ఏజెంట్లు కూర్మ రాజేందర్ , శ్రీధర్ , వెంకటేశ్వర్లు, ఇందారం ఓసీపీ పిఓ వెంకటేశ్వర రెడ్డి, డిజీఎం(ఐఈడి) చిరంజీవులు, డిజీఎంలు ఆనంద్ కుమార్, రవీందర్, మల్లయ్య, సెక్యూరిటీ ఆఫీసర్ జక్కా రెడ్డి, అన్ని గనుల మేనేజర్లు, సంక్షేమ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.