సగం సెంటర్లు మహిళలకే : రాజీవ్​గాంధీ హనుమంతు

సగం సెంటర్లు మహిళలకే : రాజీవ్​గాంధీ హనుమంతు
  • కొనుగోళ్లలో సింగిల్​ విండో సహకరించాలె
  •  లెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో  700 వడ్ల కొనుగోలు సెంటర్లకుగాను సగం కేంద్రాలను మహిళలకే అప్పగించనున్నట్లు కలెక్టర్ రాజీవ్​గాంధీ హనుమంతు తెలిపారు. శుక్రవారం రెంజల్ మండల కేంద్రంతో పాటు దూపల్లి, దండిగుట్ట గ్రామాల్లో  ధాన్యం కొనుగోలు సెంటర్లను కలెక్టర్​ పరిశీలించారు.   మహిళలు నిర్వహిస్తున్న వడ్ల కొనుగోళ్లలో సింగిల్​ విండో సహకరించాలన్నారు.  వడ్ల రకం, కాంటా వేసిన వివరాలను రైతులకు ఇవ్వాలన్నారు.

 తూకంలో తేడాలు రావద్దని,  లోడింగ్​ అన్​లోడింగ్, లారీలు, హమాలీల సమస్య రాకుండా చూడాలన్నారు.  కొనుగోలు కేంద్రాల్లో సామగ్రిని సమకూర్చుకోవడంతో పాటు గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. కలెక్టర్​ వెంట డీఆర్డీవో సాయాగౌడ్, డీఎస్​వో అరవింద్​రెడ్డి, డీసీవో శ్రీనివాస్, డీపీఎం సాయిలు ఉన్నారు.