శివకార్తికేయన్, మురుగదాస్‌ల చిత్ర టైటిల్ గా మదరాసి .. టైటిల్ గ్లింప్స్ రిలీజ్

శివకార్తికేయన్, మురుగదాస్‌ల చిత్ర టైటిల్ గా మదరాసి .. టైటిల్ గ్లింప్స్ రిలీజ్

అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న  శివకార్తికేయన్.. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. సోమవారం శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీకి 'మదరాసి' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ  హై-ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌‌‌కు సంబంధించి ఫస్ట్ లుక్ రివీల్ చేయడంతో పాటు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. యాక్షన్ విజువల్స్‌‌తో  కట్ చేసిన ఈ గ్లింప్స్‌‌లో  శివకార్తికేయన్ పవర్-ప్యాక్డ్ అవతార్‌‌లో కనిపించాడు. .

తన కెరీర్‌‌‌‌లో  ఇది 23వ చిత్రం. రుక్మిణీ వసంత్‌‌ హీరోయిన్‌‌గా నటిస్తోంది. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. ఓవైపు సల్మాన్ ఖాన్, రష్మిక జంటగా సికందర్ అనే బాలీవుడ్ మూవీ రూపొందిస్తున్న మురుగదాస్... అది పూర్తికాక ముందే శివ కార్తికేయన్ తో ‘మదరాసి’ చిత్రాన్ని స్టార్ట్ చేశారు.