ములుగులో ఆటో బోల్తా.. ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలు

ములుగు శివారు మేడివాగు దగ్గర ఆటో బోల్తా పడింది.  దీంతో ఆటోలో వెళ్తున్న ఆరుగురు ఫారెస్ట్ సిబ్బందికి గాయాలయ్యాయి.  ఎన్నికల విధులు ముగించుకొని క్యాంపుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  క్షతగాత్రులందరూ కామారెడ్డి, ఖమ్మంకి చెందిన వారే కావడం గమనార్హం.  క్షతగాత్రులందరిని అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ  ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.