- హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు
ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూర్ శివారులోని చెట్ల పొదల్లో గుర్తు తెలియని అస్థి పంజరం లభ్యమైంది. బండ్లగూడ నుంచి గౌరెల్లికి వెళ్లే దారిలోని ఇందుకూరు విల్లాల వెనుక చెట్ల పొదల్లో మేకలు కాస్తున్న కుంట్లూర్కు చెందిన సారంగి వెంకటేశ్ఓ అస్తిపంజారాన్ని గుర్తించాడు.
ఆనవాళ్లను బట్టి చనిపోయింది మగవ్యక్తిగా హయత్ నగర్ పోలీసులు గుర్తించారు. వైరుతో కంపచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియకు తరలించి ఫోరెన్సిక్ టెస్టులు చేయించారు. ఎవరైనా హత్య చేశారా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.