ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌ పూర్తికి డ్రిల్లింగ్‌‌‌‌, బ్లాస్టింగే కరెక్ట్..

ఎస్‌‌‌‌ఎల్‌‌‌‌బీసీ టన్నెల్‌‌‌‌ పూర్తికి డ్రిల్లింగ్‌‌‌‌, బ్లాస్టింగే కరెక్ట్..

హైదరాబాద్, వెలుగు: ఎస్ఎల్‌‌‌‌బీసీ టన్నెల్ పూర్తి చేసేందుకు డ్రిల్లింగ్, బ్లాస్టింగ్​మెథడ్ (డీబీఎం) ఒక్కటే సరైందని నిపుణుల కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం పైకప్పు కూలిన చోట శిథిలాల తొలగింపు, తవ్వకాలు సాధ్యం కాదని, ప్రమాద జరిగిన చోట చివరి 50 మీటర్ల (డీ2) ప్రాంతంలో బురద, మట్టి తొలగింపు కూడా అత్యంత క్లిష్టంగా మారిందని పేర్కొన్నట్టు సమాచారం. ఎస్ఎల్‌‌‌‌బీసీ ప్రమాద ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గురువారం జలసౌధలో సమావేశమైంది. 

షీర్​జోన్‌‌‌‌లో ఎంత తవ్వితే పైనుంచి మళ్లీ అంతే నీళ్లు, బురద వస్తున్నాయని కమిటీ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఆ ప్రాంతంలోనే మరో ఆరుగురు కార్మికుల మృతదేహాలు లభ్యమయ్యే అవకాశం ఉండడంతో సహాయక చర్యలను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న దానిపై నిపుణులు చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించి నిపుణుల కమిటీ ఓ సబ్​కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది

. పలు జాతీయ సంస్థలతో పాటు కల్నల్​పరీక్షిత్​మెహ్రాకు కమిటీలో స్థానం కల్పించినట్టు సమాచారం. సొరంగం ఉపరితలం నుంచి చివరి ప్రాంతానికి ఒక షాఫ్ట్ (మార్గం) నిర్మించాలంటే భూమి పొరల తీరును అంచనా వేసేందుకు బోర్​హోల్స్​తో జియోటెక్నికల్​ఇన్వెస్టిగేషన్స్ చేయాల్సిన అవసరం ఉందని అధికారులు చెబుతున్నారు. 

అయితే, అక్కడ ఆమ్రాబాద్​రక్షిత పులల అభయారణ్యం ఉండడంతో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ అనుమతులు పొందాల్సి ఉందని అంటున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తుల కమిషనర్​అర్వింద్​కుమార్, నల్గొండ సీఈ అజయ్​కుమార్, ఎన్ఐఆర్ఎం, ఎన్‌‌‌‌ఐజీఎంఆర్, ఎన్‌‌‌‌సీఎస్ నిపుణులు తదితరులు పాల్గొన్నారు.