చిన్న బడ్జెట్ సినిమాలు... పెద్ద మొత్తంలో లాభాలు

చిన్న బడ్జెట్ సినిమాలు... పెద్ద మొత్తంలో లాభాలు

మంచి కంటెంట్ ఉన్న చిత్రాలని ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఇటీవలే విడుదలైన మత్తువదలరా -2, ఆయ్, కమిటీ కుర్రాళ్ళు తదితర చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అంతేకాకుండా దర్శకనిర్మాతలకి కాసుల పంట పండించాయి. 

అయితే ప్రముఖ డైరెక్టర్ రితీష్ రానా మరియు యంగ్ హీరో శ్రీ సింహ కోడూరి కాంబినేషన్ లో తెరకెక్కిన మత్తు వదలరా 2 చిత్రం సెప్టెంబర్ 13వ తారీఖున విడుదలయ్యింది. కామిక్ కేపర్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ అయిన మొదటి రోజునుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. కాగా ఇప్పటికే ఈ చిత్రం రూ.19 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే మత్తు వదలరా-2 చిత్రంతోపాటూ విడుదలైన ఇతర చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా అలరించలేకపోవడంతో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. 

ALSO READ | అన్ని సినిమాల రికార్డులు బ్రేక్..ఇండియన్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే

ఇక యంగ్ హీరో నార్నే నితిన్ మరియు నూతన డైరెక్టర్ అంజి కే మణిపుత్ర కాంబినేషన్ లో తెరకెక్కిన ఆయ్ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద దాదాపుగా రూ.14 కోట్లు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. కుల వివక్ష, లవ్ మరియు ఫ్రెండ్షిప్ వాల్యూ వంటి విషయాల గురించి చెబుతూ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో కూడా ప్రేక్షులకులను బాగానే అలరిస్తోంది.

ప్రముఖ డైరెక్టర్ యదు వంశీ డైరెక్ట్ చేసిన కమిటీ కుర్రాళ్ళు చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద బాగానే కలెక్ట్ చేసింది. రాజకీయాలు మరియు ఫ్రెండ్షిప్ విలువలు తెలిపే జోనర్ తెరకెక్కిన ఈ చిత్రం దాదాపుగా రూ.25 కోట్లు కలెక్ట్ చేసింది. దీన్నిబట్టి చూస్తే బడ్జెట్ తో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్నటువంటి చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయని ఈ చిత్రాలు నిరూపించాయి.