Phone alert: ఫోన్ ను​ప్యాంట్​ జేబులో పెడుతున్నారా.. పేలిపోతుంది జాగ్రత్త.!

Phone alert:   ఫోన్ ను​ప్యాంట్​ జేబులో పెడుతున్నారా.. పేలిపోతుంది జాగ్రత్త.!

ఫోన్​లు పేలతాయి.. ఈ విషయం చాలా మందికి తెలుసు.. అయినా ప్రస్తుత రోజుల్లో బడి పిల్లల దగ్గర నుంచి అత్యున్నతస్థాయిలో ఉద్యోగం చేసే వారికి ఫోన్​ కంపల్సరీ అయింది. దీంతో ఫోన్​ వాడకం తప్పడంలేదు.  చాలామంది ఫోన్​ ను జేబులో పెట్టుకొని తిరుగుతుంటారు.  అయితే ఓ మహిళ ప్యాంట్​ జేబులో ఉన్న ఫోన్​ పేలి .. కాలిన గాయాలతో..ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది.. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే...

బిజీగా ఉన్న సూపర్ మార్కెట్ లో ఓ మహిళ షాపింగ్ చేస్తున్న క్రమంలో జేబులో సెల్ ఫోన్ పేలిపోయింది. దీనికి సంబంధించిన సోషల్​ మీడియాలో వైర‌ల్‌గా మారింది.ఈ వైరల్ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ X (గతంలో ట్విట్టర్)లో @Bubblebathgirl అనే హ్యాండిల్ షేర్ అయింది. రెండు రోజుల క్రితం ( ఫిబ్రవరి 16 నాటికి)  షేర్ చేయబడిన ఈ వీడియో  11 K వీక్షణలను పొందింది. 

 బ్రెజిల్ లోని అనపోలిస్   ఓ మ‌హిళ  షాపింగ్​ మాల్​కు వెళ్లింది. దుకాణంలోని  వస్తువులను చూస్తూ .. తన భర్తతో మాట్లాడుతూ అవసరమైన వాటిని పర్చేజ్​ చేస్తున్నారు. అప్పుడు మహిళ ప్యాంట్​ జేబులోనుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.  ఆ మహిళ మోటరోలా మోటో E32 ఫోన్​ వాడుతుంది. 

సోషల్​ మీడియాలో వైరల్​ అవుతున్న వీడియోలో మహిళ ప్యాంట్​ జేబులో ఉన్న సెల్​ఫోన్​ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో షాపింగ్​ మాల్​ లో అగ్నిప్రమాదం జరిగిందేమోనని కస్టమర్లు భయపడ్డారు.

 ఓ మహిళ ప్యాంట్​కు మంటలు అంటుకోవడంతో ఒక్కసారిగా ఆ మహిళ భయపడి..అటుఇటు ప‌రుగెత్తింది. . తన భర్త మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో కనపడింది.   ఆ త‌రువాత దుకాణం నుండి బయటకు పరిగెత్తింది. పక్కనే ఉన్నవారు ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.ఆమె షర్ట్ కాలిపోయి ఆమె చేతిపై చిన్న చిన్న కాలిన గాయాలు అయ్యాయి. మంట‌లు ఆరిపోయాక ఆమెను ఆల్ఫ్రెడో అబ్రానో ద‌వాఖానాకు తరలించారు. ఆమె చేయి, మేచేయి, వీపు, వెన‌క‌భాగాల‌కు కాలిన గాయాల‌య్యాయి. ఆమె జుట్టులో కూడా కొంత భాగం కాలిపోయింది.