స్వయం సహాయక సంఘాల ద్వారా..సోలార్​ ఉత్పత్తి కేంద్రాలు : భట్టి విక్రమార్క

స్వయం సహాయక సంఘాల ద్వారా..సోలార్​ ఉత్పత్తి కేంద్రాలు : భట్టి విక్రమార్క
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మెదక్​ టౌన్​, వెలుగు :  రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధికారితే లక్ష్యంగా పని చేస్తోందని వారి కోసం స్వయం సహాయక సంఘాల ద్వారా వెయ్యి మెగావాట్ల సోలార్ ఉత్పత్తి   కేంద్రాలు ఏర్పాటు చేసి త్వరలో టెండర్లు ఖరారు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు  ప్రగతిపై  ప్రజాభవన్ నుంచి నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్​, అధికారులు పాల్గొన్నారు. 

 డిప్యూటీ సీఎం మాట్లాడుతూ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. అనంతరం  మెదక్​ జిల్లా కలెక్టర్​ రాహుల్​ రాజ్​ వీడియో కాన్ఫరెన్స్​లో మాట్లాడుతూ... జిల్లాలోని నర్సాపూర్​లో దేవస్థానం భూమి 100 ఎకరాలు గుర్తించినట్లు తెలిపారు.  జిల్లాల లక్ష్యాలకు అనుగుణంగా మరో  50 ఎకరాల భూమిని   గుర్తించి  ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తామని అన్నారు.

 జిల్లాలో75  సబ్ స్టేషన్స్ ఉన్నాయని సర్వే నెంబర్లు వారీగా నివేదికలు అందచేసేలా విద్యుత్తు శాఖ అధికారులకు సూచించామని తెలిపారు.  ఈ కార్యక్రమంలో  డీఎఫ్​వో జోజీ, డీఆర్​డీవో శ్రీనివాసరావు, గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి శశికళ, ట్రాన్స్​కో ఎస్​ఈ శంకర్​, డీఈ చాంద్​ షరీఫ్​ పాషా, ఏడీఈ మోహన్​, సంబంధిత శాఖల అధికారులు తదితరులు 
పాల్గొన్నారు.