
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఎల్కతుర్తి, వెలుగు: ఆస్తి పంచి ఇవ్వడం లేదనే కారణంతో తల్లిని కొడుకు హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి సర్కిల్ ఆఫీస్ లో సీఐ పులి రమేశ్ వివరాలు వెల్లడించారు. వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం కుమారస్వామి-, రేవతి(40) దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కుమారస్వామి 15 ఏండ్ల కింద అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఇద్దరు కొడుకులను తల్లి కూలి పని చేస్తూ పోషించింది. పెద్ద కొడుకు గ్రామంలోనే ఉంటుండగా, విజయ్ హైదరాబాద్ లో జాబ్ చేస్తున్నాడు.
అజయ్ కొద్ది రోజులుగా భూమి, ఇల్లు పంచివ్వాలని తల్లితో గొడవ పడుతున్నాడు. తమ్ముడి పెండ్లి జరిగాక ఆస్తి పంపకాలు చేద్దామని తల్లి దాటవేస్తూ వస్తోంది. ఈ నెల 7న సాయంత్రం ఇదే విషయమై తల్లి రేవతి, కొడుకు అజయ్ మధ్య గొడవ జరిగింది. అజయ్ గొడ్డలితో తల్లి రేవతిపై దాడి చేయగా, మెడ భాగంలో గాయమై అక్కడికక్కడే చనిపోయింది. చిన్న కొడుకు విజయ్ కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోతులనడుమ గ్రామంలో అజయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు పంపించారు.