కిరాణా దుకాణం, టీ స్టాళ్లలో గంజాయి చాక్లెట్లు

కిరాణా దుకాణం, టీ స్టాళ్లలో గంజాయి చాక్లెట్లు

ఘట్​కేసర్/జీడిమెట్ల, వెలుగు: కిరాణా దుకాణం, టీ స్టాళ్లలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న నిర్వాహకులను ఎస్ఓటీ పోలీసులు వేర్వేరుగా అరెస్ట్ చేశారు. పోచారం ఐటీ కారిడార్ పరిధిలోని అన్నోజిగూడ ఫ్లై ఓవర్ వద్ద రామ్ నారాయణ్ (33), కిషోర్ కుమార్ (22) టీ స్టాల్ నడుపుతున్నారు. గంజాయి అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో వీరిపై నిఘా పెట్టి, బుధవారం అరెస్ట్ చేశారు. 

నిందితుల నుంచి 1.19 కేజీల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే జగద్గిరిగుట్ట రింగ్​బస్తీలో బీహార్​కు చెందిన సునీల్​కుమార్​ఝా కిరాణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అక్రమార్జనకు అలవాటు పడి దుకాణంలో గంజాయి చాక్లెట్లను అమ్ముతున్నాడు. ఒక్కోచాక్లెట్​ను రూ.20కు విక్రయించి కార్మికులు, యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నాడు. విశ్వసనీయ సమాచారంతో బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. 13 కిలోల గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు.