హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. రూ. 10 లక్షలు విలువ చేసే 32 కిలోల గంజాయిని సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగర శివారులోని కొల్లూరు పీఎస్ పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు ఓఆర్ఆర్ టోల్ గేట్ వద్ద చెకింగ్ నిర్వహించారు. బానోత్ లక్ష్మణ్ అనే వ్యక్తిని చెక్ చేయగా అతని వద్ద రూ. 10 లక్షల 50 వేలు విలువ చేసే 32 కిలోల గంజాయిని గుర్తించారు.
ఆ మొత్తాన్ని సీజ్ చేసీ పీఎస్ కు తరలించారు. బానోత్ లక్ష్మణ్ పై కేసు నమోదు చేసుకున్న కొల్లూరు పోలీసులు విచారణ చేపట్టారు. గంజాయి ఎక్కడి నుంచి రవాణా చేస్తు్న్నడనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు.