- ఎస్పీ గౌష్ ఆలం
ఆదిలాబాద్టౌన్, వెలుగు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని జిల్లా ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో 2కే రన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టేడియం నుంచి ఆర్టీవో కార్యాలయం వరకు నిర్వహించిన రన్లో ఎస్పీ పాల్గొన్ని యువకుల్లో ఉత్సాహాన్ని నింపారు. కలెక్టరేట్ ఆవరణలో రోడ్డు భద్రతా నియమాలను తెలిపే హైడ్రోజన్ స్కై బెలూన్ ను ఆవిష్కరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలని సూచించారు.
మద్యం సేవించి వాహనాలను నడపవద్దని, వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎల్.జీవన్ రెడ్డి, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్, ఎంవీఐలు కే.రవీందర్, ప్రదీప్ గౌడ్, యశ్వంత్ కుమార్, ఏఎంవీఐలు విద్యాధర రెడ్డి, ప్రత్యూష, హరేంద్ర కుమార్, వినయ్, సీఐలు సునీల్ కుమార్, కరుణాకర్, ప్రణయ్ కుమార్, డి. సాయినాథ్, ఫణిధర్, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.