పటిష్టంగా పోలీస్​ భరోసా అమలు : ఎస్పీ కె.నరసింహ

పటిష్టంగా పోలీస్​ భరోసా అమలు : ఎస్పీ కె.నరసింహ
  • మాట్లాడుతున్న ఎస్పీ నరసింహ 

సూర్యాపేట, వెలుగు : పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంతో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేయాలని ఎస్పీ కె.నరసింహ సూచించారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న ప్రతి అంశంపై పోలీసులు అవగాహన కలిగి ఉండాలన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో ప్రతి బుధవారం పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని నిర్వహించి సమస్యలు గుర్తించి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. 

సమస్యలు సృష్టించే వ్యక్తులకు కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నేరాలను అదుపు చేయవచ్చని చెప్పారు. జిల్లాలో పోలీసు ప్రజా భరోసా కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో వీపీవో ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు వచ్చే నాటికి గ్రామాలు పోలీసుల ఆధీనంలోకి వస్తాయని, దీంతో ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుందని తెలిపారు.

 అనంతరం ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావుతో కలిసి జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో ఏఆర్ అపీషనల్ ఎస్పీ జనార్దన్ రెడ్డి, కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ మట్టయ్య, ఏఆర్ డీఎస్పీ నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్ నాగభూషణం, సీఐలు చరమందరాజు, రజిత, శివశంకర్, రాజశేఖర్, వీరరాఘవులు, రామకృష్ణారెడ్డి, రఘువీర్ రెడ్డి, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.