పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి : రాజేశ్​చంద్ర

పోలీసులు బాధ్యతగా వ్యవహరించాలి :  రాజేశ్​చంద్ర
  • ఎల్లారెడ్డి పోలీస్​ స్టేషన్​ను తనిఖీ చేసిన ఎస్పీ రాజేశ్​చంద్ర

ఎల్లారెడ్డి, వెలుగు: పోలీసులు ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ రాజేశ్​చంద్ర సూచించారు. శనివారం ఎల్లారెడ్డి పోలీస్​ స్టేషన్​ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, ఎప్పటికప్పుడు నవీకరించాలని సూచించారు. నిరంతరం పెట్రోలింగ్​ నిర్వహించి, అనుమానితులను ఆరా తీయాలన్నారు.

 సీసీ కెమెరాలను పరిశీలించి, మరిన్ని కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్​ స్టేషన్​ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ శ్రీనివాస్ రావు, ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్ స్పెక్టర్ రవీంద్ర నాయక్ , సదాశివ నగర్ సీఐ సంతోశ్​కుమార్, ఎల్లారెడ్డి ఎస్సై మహేశ్, తాడ్వాయి ఏఎస్సై కొండల్ రెడ్డి 
పాల్గొన్నారు.