మెదక్ టౌన్, వెలుగు : పోలీసులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ విధులు నిర్వర్తించాలని ఎస్పీ రోహిణీ ప్రియదర్శిని సూచించారు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఎన్నికల సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించి ప్రతి అంశంపై అధికారులు సంపూర్ణ పరిజ్ఞానం కలిగి ఉండాలన్నారు. ఎన్నికల సమయంలో సమస్యలు సృష్టించే వారిపై పూర్తి నిఘా ఉంచాలన్నారు. రౌడీ షీటర్లను, అనుమానితులను, బైండోవర్ చేయాలని ఆదేశించారు. సమావేశంలో ఏఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Also Read :విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
సాఫ్ట్‌స్కిల్ డెవలప్మెంట్పై వర్క్‌షాప్
పోలీసులకు సాఫ్ట్‌స్కిల్ డెవలప్మెంట్పై అవగాహన అవసరమని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులకు ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఐజీపీ ఆనంద్ వర్ధన్ శుక్ల మాట్లాడుతూ... ప్రతి పోలీస్ అధికారి ప్రజల సమస్యలను ఓర్పుగా వినడం అలవాటు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరిరెడ్డి, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సైబర్ క్రైమ్ డీఎస్పీ సుభాశ్‌చంద్రబోస్, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.