స్పెయిన్ లో వరదలు కనీవిని ఎరగని రీతిలో ప్రళయం సృష్టిస్తున్నాయి. వరదల దాటికి మృతుల సంఖ్య 158 కు చేరింది. వందలాది మంది గల్లంతయ్యారు. చాలా మంది బురదలో కూరుకుపోయారు. 1200 మంది సైనికులు సహాయక చర్యలు చేపడుతున్నారు.హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని రక్షణ మంత్రి మార్గరీటా రోబుల్స్ కాడెనా సెర్ తెలిపారు.
లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇండ్లు, అపార్ట్మెంట్లలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. హఠాత్తుగా వచ్చిన వరదలతో జనజీవనం అతలాకుతలం అయ్యింది. నదులన్నీ పొంగి వీధులను ముంచెత్తాయి. రైల్వే లైన్స్, రోడ్లన్నీ నీటమునిగాయి. ప్రజా రవాణా స్తంభించిపోయింది. ప్రాణాలు కాపాడుకునేందుకు చాలామంది చెట్లు ఎక్కారు.
Also Read : వైట్హౌజ్లో దీపావళి..సంబరాల్లో మునిగి తేలిన కమలా హారీస్
కుండపోత వర్షం, వడగళ్ల వానలు వాలెన్సియాలోని తూర్పు ప్రావిన్స్‌తో సహా పలు ప్రాంతాల వీధులన్నీ నదులుగా మారాయి. ఇళ్లలోని గ్రౌండ్ ఫ్లోర్‌లలోకి ప్రవేశించడంతో కార్లు కొట్టుకుపోయాయి.
స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ అక్టోబర్ 31న వాలెన్సియాను సందర్శించారు. విధ్వంసకర వరదల వల్ల ప్రభావితమైన ప్రాంతాలకు ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు.