Bank Jobs: ఐడీబీఐలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్

Bank Jobs: ఐడీబీఐలో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్

వివిధ విభాగాల్లో స్పెషల్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండస్ట్రియల్ డెవలప్​మెంట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఐడీబీఐ) అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 20వ తేదీలో ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టుల సంఖ్య: 119.

పోస్టులు: డిప్యూటీ జనరల్ మేనేజర్  గ్రేడ్– డి 08, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గ్రేడ్–సి 42, మేనేజర్ గ్రేడ్​–బి 69. 

ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, బీసీఏ, బీఎస్సీ, బీటెక్ లేదా బీఈ, ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంబీఏ/ పీజీడీఎం ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: మేనేజర్ గ్రేడ్ బి పోస్టుకు కనిష్ట వయస్సు 25 ఏండ్లు, గరిష్ట వయస్సు 45 ఏండ్లు ఉండాలి. అసిస్టెంట్​జనరల్ మేనేజర్ పోస్టుకు కనిష్ట వయస్సు 28 ఏండ్లు, గరిష్ట వయస్సు 40 ఏండ్లు, డిప్యూటీ జనరల్మేనేజర్ గ్రేడ్ డి పోస్టుకు కనిష్ట వయస్సు 35 ఏండ్లు, గరిష్టంగా 45 ఏండ్లు ఉండాలి.

అప్లికేషన్ ప్రారంభం: ఏప్రిల్ 7.

చివరి తేదీ: ఏప్రిల్ 20.

అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,050. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 ఫీజు చెల్లించాలి. 

సెలెక్షన్ ప్రాసెస్: వయస్సు, విద్యార్హతలు, వర్క్ ఎక్స్ పీరియన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు.