
ఫొటోగ్రాఫర్, వెలుగు : షబ్ - ఏ - మేరాజ్’ సందర్భంగా సోమవారం రాత్రి చార్మినార్ మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అధిక సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ప్రత్యేక గీతాలు ఆలపిస్తూ, ఖురాన్ చదువుతూ రాత్రంతా అక్కడే జాగరణ చేశారు. పవిత్ర దినం సందర్భంగా కలర్‌ఫుల్ లైటింగ్‌తో మసీదు ముస్తాబు చేశారు.
అలాగే గ్రేటర్‌లోని అన్ని మసీదుల్లో ప్రార్థనలు, జాగరణ జరిగాయి.