ఫంక్షన్ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది. డీజే సౌండ్... ఆ సౌండ్ కు అనుగుణంగా వేసే స్టెప్పు, అయితే అదిప్పుడు ఓల్డ్ ఫ్యాషన్, డీజీల ప్లేస్ బ్యాండ్ బాయిస్ కనిపిస్తున్నారు. ఫంక్షన్లకే కాదు.. వినాయక నిమజ్జనమైనా, బతుకమ్మల ఊరేగింపైనా.. రాజకీయ పార్టీల ర్యాలీ అయినా.. ఈ బ్యాండ్ మోగుతోంది. అలాగని ఇదేదో కొత్తగా పుట్టుకొచ్చిన మోడ్రన్ మ్యూజిక్ బ్యాండ్ కాదు... పక్కా పల్లె టూరు బ్యాచ్. ఇంకా చెప్పాలంటే అడవి బిడ్డల ఆటాపాట. వినాయక నిమజ్జనాల ఊరేగింపుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఆదివాసీ బ్యాండ్ పై స్పెషల్ స్టోరీ మీకోసం..
వెలుగు: ఈ బ్యాండ్ సౌండ్ వినపడితే ఈ నొప్పులేయాల్సిందే. ఆ పల్లెపాటకు గొంతు కలపాల్సిందే. వారు రంగంలోకి దిగితే దుమ్మురేగిపోవాల్సిందే. ఫంక్షన్లలో వారి ఆటాపాటా మొదలైతే ఇక జోషు కొదవే ఉండదు. చిన్నపిల్లల నుంచి ముసలోళ్ల వరకు అందరూ చిందులేయాల్సిందే. ఈ ఇంట్రడక్షన్ చదివి... ఇదేదో ఫారిన్ మ్యూజిక్ బ్యాండ్ అనుకుంటే పొరపాటే. కుమ్రంభీం జిల్లాలోని ఏ పెళ్లి జరిగినా.. బహిరంగ సభ జరిగినా ఈ ఆదివాసీ బ్యాండ్ ఆదరగొడుతోంది. ఏజెన్సీలో మండలానికి కనీసం పది బ్యాండ్ లు వెలిశాయంటే వీటికున్న ట్రేజ్ ఎంతో తెలిసిపోతుంది. ఇప్పుడు హైదరాబాద్ వంటి పట్టణాల్లో కూడా ఈ బ్యాండ్ సందడి మొదలైంది.
సంప్రదాయానికి పెద్దపేట...
కుమ్రంభీం జిల్లా ఆదివాసీలు తమ కబ్బరు, సంప్రదాయాలకు ప్రాణమిస్తారు. ప్రతినెలా ఏదో ఒక వేడుక చేసుకుంటూనే ఉంటారు.ఈ వేడుకలో దైవారాధనతోపాటు నృత్యాలు,ఆటపాటలతో వినోదంగా గడుపుతారు. అందుకే వీరికి చిన్నప్పటి నుంచే సంగీతంపై పట్టుపెరుగుతుంది. ప్రత్యేకించి 'దండారీ' పండుగ కోసం నేర్చుకునే కోలాటం, గుసాడీ నృత్యం ఇప్పుడు వీరికి ఎంతగానో ఉపయోగపడుతోంది. ఎటువంటి శిక్షణ అవసరం లేకుండా సహజంగా నేర్చుకున్న ఆటాపాటా కావడంతో.. ఫంక్షన్లు, ర్యాలీల్లో వీరి ప్రదర్శన కూడా అంతే సహజంగా, జోష్ ఫుల్ గా సాగుతోంది.
డప్పు పోయి బ్యాండ్ వచ్చే ఎక్కువగా తోలు (మేక చర్యం) తో తయారు చేసిన డప్పు, డోలు, తుడుం, పరావెట్టె, గుమ్మల వంటి వాయిద్యాలను ఉపయోగిస్తారు. బ్యాండ్ లోకూడా వాటినే ఉపయోగిస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అయితే తోలు రేటు పెరగడంతో రెడీమేడ్ గా దొరికే బ్యాండ్లు వాడుతున్నారు. అదొక్కటే తప్ప మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటున్నారు ఈ బ్యాండ్ బాయ్స్
భాగ్యనగరంలో గుసాడీ..
హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు. జరిగే సమయంలో వీరికి గిరాకీ ఎక్కువ. గణేశ్ నవరాత్రుల సమయంలో వీరి బ్యాండ్ కనీసం రూ.30 వేల నుంచి రూ. 40 వేల దాకా పలుకుతోంది. మిగతా సమయంలో రూ.20 వేల టోపీ, అయితే పార్టీని బట్టి, ఇచ్చే సొమ్మును బట్టి వీరి ప్రదర్శన స్థాయి కూడా మారుతుంది. పెద్ద ఫంక్షనైతే రెండు మూడు బ్యాండ్లు కలిసి ప్రదర్శన ఇస్తాయి.అందరూ కాలు కలపాల్సిందే.... మోడ్రన్ బ్యాండ్లో ఉండే గందరగోళం వీరిదగ్గర కనిపించదు. చిన్న చిన్న స్టెప్పులు, చెవులకు ఇంపుగా వినిపించే పల్లెపాటలే వీరి బలం. అందుకే ఈజీగా వేసే స్టెప్పులకు ఎవరైనా కాలు, గొంతు కలపాల్సిందే. పెండ్లి వేడుకలైతే రెంసా, దందారీ, కోలాటం, గుమ్మెల, గుసాడీ వంటివి ప్రదర్శిస్తారు. ర్యాలీలు, ఊరేగింపులకు గెర్వా. సతిల నృత్యాలకు ప్రాధాన్యత ఇస్తారు. ఇక సినిమా పాటలకు వీరు వేసే స్టెప్పులు చూస్తే భలే గమ్మత్తుగా అనిపిస్తుంది.
చందాలు వేసుకొని...
ఏజెన్సీ గ్రామాల్లో యువతకు ఇదో ఉపాధి మార్గంగా మారింది. మొదట్లో చందాలు వేసు కొని బ్యాండ్ గ్రూప్ను తయారుచేసుకున్న వీరే ఇప్పుడు మిగతా యువతకు ఉపాధి చూపుతున్నారు. ఒక్కో గ్రామంలో కనీసం 15 మంది నుంచి 50 మంది వరకు బ్యాండ్ బాయ్స్ ఉంటున్నారు. అయితే కేవలం ఉపాధి కోసమే కాకుండా ఆదివాసీ సంప్రదాయాలను చాటిచెప్పేందుకు కూడా బ్యాండ్ను ఉపయోగించుకుంటున్నామని చెబుతున్నారు. చాలా ప్రాంతాల్లో డీజేలకు అనుమతులు రద్దు చేయడం వీరికి ఎంతగానో కలిగిస్తోంది. సంప్రదాయ నృత్యం కావడం, కావాల్సినంత జోష్ ఫుల్ గా ఉండడంతో అందరూ ఈ ఆదివాసీ బ్యాండ్ వైపే మొగ్గు చూపుతున్నారు.
వెలుగు, లైఫ్