సమ్మర్ స్పెషల్ రైళ్లు ఆగస్టు వరకు పొడిగింపు

భారతీయ రైల్వే సమ్మర్ స్పెషల్  ప్రత్యేక రైళ్లను ఆగస్టు వరకు పొడిగించారు.తిరుపతి, హైదరాబాద్, విజయవాడసహా ఇతర రూట్ల నుంచి ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. భారతీయ రైల్వే   రద్దీని దృష్టిలో పెట్టుకొ ని జూలై 3 నుండి ఆగస్టు 30 వరకు పొడిగించారు.ఇప్పటికే నడుస్తున్న  14 స్పెషల్ ట్రైన్స్‌ ను కూడా  జూలై 1 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించింది రైల్వే శాఖ. 
 
సుబేదర్‌గంజ్ - సికింద్రాబాద్
సికింద్రాబాద్ - సుబేదర్‌గంజ్
కాకినాడ టౌన్ - లింగంపల్లి
లింగంపల్లి - కాకినాడ టౌన్
కాచిగూడ - మధురై
మధురై - కాచిగూడ
సికింద్రాబాద్ - రామనాథపురం
రామనాథపురం - సికింద్రాబాద్ 
కాచిగూడ - నాగర్‌కోల్ 
పాట్నా - సికింద్రాబాద్
హైదరాబాద్ - పాట్నా
సికింద్రాబాద్ - పాట్నా
దానాపూర్ - సికింద్రాబాద్
సికింద్రాబాద్ - దానాపూర్‌  

స్పెషల్ ట్రైన్స్ వివరాలు..

రైలు నెంబర్ 07605 తిరుపతి నుంచి అకోలాకు ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.15 గంటలకు అకోలా చేరుకుంటుంది. తిరుపతి -అకోలా రైలును 2023 జూలై 7 నుంచి ఆగస్ట్ 25 వరకు పొడిగించింది రైల్వేశాఖ. 

రైలు నెంబర్ 07606 అకోలా నుంచి తిరుపతికి ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 8.10 గంటలకు అకోలాలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అకోలా -తిరుపతి రైలును 2023 జూలై 9 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించింది రైల్వేశాఖ.

రైలు నెంబర్ 07091 కాజీపేట్ నుంచి తిరుపతికి ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు ఉదయం 11 గంటలకు కాజీపేట్‌లో బయల్దేరి రాత్రి 10.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కాజీపేట్-తిరుపతి రైలును 2023 జూలై 4 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించింది రైల్వేశాఖ. 

రైలు నెంబర్ 07092 తిరుపతి నుంచి కాజీపేట్‌కు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 11.40 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45 గంటలకు కాజీపేట్ చేరుకుంటుంది. తిరుపతి-కాజీపేట్ రైలును 2023 జూలై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించింది రైల్వేశాఖ. 

రైలు నెంబర్ 07631 హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 11.15 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. హైదరాబాద్-- నర్సాపూర్ రైలును 2023 జూలై 1 నుంచి ఆగస్ట్ 26 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07632 నర్సాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. నర్సాపూర్-హైదరాబాద్ రైలును 2023 జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించింది రైల్వే

రైలు నెంబర్ 07643 హైదరాబాద్ నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 7.30 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. హైదరాబాద్-తిరుపతి రైలును 2023 జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07644 తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. తిరుపతి-హైదరాబాద్ రైలును 2023 జూలై 4 నుంచి ఆగస్ట్ 29 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07698 విజయవాడ నుంచి నాగర్‌సోల్‌కు ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 4.15 గంటలకు విజయవాడలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.10 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటుంది. విజయవాడ-నాగర్‌సోల్ రైలును 2023 జూలై 7 నుంచి ఆగస్ట్ 25 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07699 నాగర్‌సోల్ నుంచి విజయవాడకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 10 గంటలకు నాగర్‌సోల్‌లో బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 5.50 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. నాగర్‌సోల్-విజయవాడ రైలును 2023 జూలై 8 నుంచి ఆగస్ట్ 26 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07185 మచిలీపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు మధ్యాహ్నం 3.15 గంటలకు మచిలీపట్నంలో బయల్దేరి రాత్రి 11 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మచిలీపట్నం-సికింద్రాబాద్ రైలును 2023 జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07186 సికింద్రాబాద్ నుంచి మచిలీపట్నం వరకు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 11.55 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు మచిలీపట్నం చేరుకుంటుంది. సికింద్రాబాద్-మచిలీపట్నం రైలును 2023 జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించింది రైల్వే.

రైలు నెంబర్ 07481 తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు రాత్రి 7.50 గంటలకు తిరుపతిలో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుపతి-సికింద్రాబాద్ రైలును 2023 జూలై 2 నుంచి ఆగస్ట్ 27 వరకు పొడిగించింది రైల్వే.

ALSO READ:కాళేశ్వరం ఖర్చు.. ప్రతినెల 2 వేల100 కోట్లు

రైలు నెంబర్ 07482 సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రతీ సోమవారం అందుబాటులో ఉంటుంది. ఈ రైలు సాయంత్రం 5.50 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. సికింద్రాబాద్-తిరుపతి రైలును 2023 జూలై 3 నుంచి ఆగస్ట్ 28 వరకు పొడిగించింది రైల్వే.