న్యూఢిల్లీ: క్విక్ కామర్స్ వ్యాపారంలోకి వస్తున్నట్టు స్పెన్సర్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ నుంచి కార్యకలాపాలను మొదలుపెడతామని తెలిపింది. తన స్టోర్ల ద్వారా సరుకులను 30 నిమిషాల్లోపు ఇంటికి తెచ్చిస్తుంది. స్పెన్సర్స్ రిటైల్‌కు బెంగాల్, యూపీలో 89 స్టోర్లు ఉన్నాయి.
క్విక్‌కామర్స్ కోసం కొత్తగా క్యాపెక్స్ అవసరం లేదని, స్టోర్ల సిబ్బందినే వాడుకుంటామని కంపెనీ చైర్మన్ శాశ్వత్గోయెంకా చెప్పారు. అవసరమైతే డార్క్స్టోర్లనూ తెరుస్తామని చెప్పారు. దక్షిణాది, ఎన్సీఆర్ ప్రాంతాల్లోని స్టోర్లను మూసివేశామని చెప్పారు