Health Tips: దాల్చిన చెక్కతో షుగర్​ కంట్రోల్​ .. ఎలా వాడాలంటే..

Health Tips: దాల్చిన చెక్కతో షుగర్​ కంట్రోల్​ .. ఎలా వాడాలంటే..

దాల్చిన చెక్క ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది ఆహారపు రుచిని పెంచడమే కాకుండా అనేక పోషకాలను అందిస్తుంది. మధుమేహంతో బాధపడే వారికి దాల్చిన చెక్క నీరు దివ్యౌషధం. దాల్చిన చెక్క మసాలా కాదు. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు దాగి ఉంటాయి. 

నీరు, దాల్చినచెక్క కలయిక ఒక మంచి పానీయం. ఇది శరీరంలోని అన్ని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. దీని ప్రయోజనాలు ఇక్కడితో ముగియవు. దాల్చిన చెక్క నీరు శరీరంలో పెరిగే అవాంఛిత కొవ్వును కరిగిస్తుంది. దీంతో పాటు ఇది గుండెకు సంబంధించిన వ్యాధులను, అల్జీమర్స్ వంటి వ్యాధులను తొలగిస్తుంది. 

 దాల్చిన చెక్కలో ఉండే ఔషధ గుణాలు మధుమేహాన్ని నయం చేస్తాయి. ఇందులో ఉండే ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. మధుమేహంతో సంబంధం ఉన్న ఇతర వ్యాధులను కూడా నయం చేస్తుంది. దాల్చిన చెక్క నీటిని తయారు చేయడానికి ఒక గిన్నెలో లీటరు నీటిని తీసుకోవాలి. 

అందులో ఒక అంగుళం దాల్చిన చెక్క ముక్కను వేయాలి. రాత్రంతా అలాగే వదిలేయాలి. అందులో కొన్ని నిమ్మకాయ చుక్కలని పిండవచ్చు. మరుసటి రోజు దాహం వేసినప్పుడల్లా ఈ నీటిని తాగాలి. మరొక పద్దతిలో దాల్చిన చెక్కను నీటిలో మరిగించి కూడా తీసుకోవచ్చు. ఇందుకోసం కేవలం రెండు కప్పుల నీళ్లు తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలపాలి. ప్రతిరోజూ దీనిని తాగాలి. డయాబెటిస్‌లో మీరు ఖచ్చితంగా దీని ప్రయోజనం పొందుతారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

ALSO READ | Good Health: వర్షాకాలం.. బత్తాయితో బోలెడు లాభాలు..

దాల్చిన చెక్కను ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు. ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని 1 గ్లాసు నీటిలో కలిపి ఉదయం పరగడుపున తాగొచ్చు. ఇందుకోసం దాల్చిన చెక్కను రాత్రిపూట నీటిలో వేసి .. ఉదయం ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగాలి. దాల్చిన చెక్క టీ తాగితే మెటబాలిక్ సిండ్రోమ్ ను అధిగమించొచ్చు. డయాబెటిస్ లేకపోతే ఒక అంగుళం దాల్చిన చెక్కను ఉడికించి నిమ్మరసం, తేనె, నల్ల మిరియాలు, యాలకులు, పుదీనా పొడి కలిపి తాగాలి.

దాల్చినచెక్క మధుమేహంతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అనేక శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల చికిత్సలో వినియోగించబడుతుంది. ఆర్థరైటిస్తో పాటు తలనొప్పి నివారణకు కూడా సహాయపడుతుంది