భారత మాజీ ప్లేయర్లు శ్రీశాంత్, గంభీర్ మధ్య వాగ్వాదం పెరుగుతూనే ఉంది. లెజెండ్స్ లీగ్ లో భాగంగా నిన్న వీరిద్దరూ గొడవ పడగా మ్యాచ్ అనంతరం గంభీర్ పై శ్రీశాంత్ సంచలన కామెంట్స్ చేసాడు. గంభీర్ కు సహచర ప్లేయర్లను గౌరవించడం తెలియదని విరాట్ కోహ్లీ గురించి ఎవరైనా బ్రాడ్ కాస్టర్లు అడిగితే వేరే విషయాలు మాట్లాడతాడని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా గంభీర్ గురించి శ్రీశాంత్ మరోసారి సంచలన ఆరోపణలు చేసాడు. గంభీర్ తనను ఫిక్సర్ అన్నాడని చెప్పుకొచ్చాడు.
బుధవారం(డిసెంబర్ 6) సూరత్‌లో గుజరాత్ జెయింట్స్, ఇండియా క్యాపిటల్స్ మధ్య జరిగిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 ఎలిమినేటర్ మ్యాచ్ లో గంభీర్ తనను ‘ఫిక్సర్’ అని పిలిచాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ ఆరోపించాడు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో గంభీర్ తనను 'ఫిక్సర్' అని పిలుస్తున్నాడని శ్రీశాంత్ వెల్లడించాడు. గంభీర్ ను ఒక్క మాట కూడా అనలేదని ఎమోషనల్ అయ్యాడు.
“మీ ప్రేమ, మద్దతు తెలుపుతున్నందుకు కృతజ్ఞతలు. మీ ప్రోత్సాహం వల్ల నేను వినయంగా అడుగుతున్నాను. దేవుడి దయ వల్ల రెండు ప్రపంచకప్‌లు గెలిచే జట్టులో సభ్యుడిగా ఉన్నందకు అదృష్టంగా భావిస్తున్నాను. నేను సాధారణ వ్యక్తిని. మీ అందరికీ నా హృదయపూర్వక గౌరవాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇంకేమీ బాధపడకుండా నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తాను". అని శ్రీశాంత్ తెలియజేశాడు.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా రెండో ఓవర్ లో శ్రీశాంత్ బౌలింగ్ లో ఓపెనర్ గంభీర్ తొలి రెండు బంతులను వరుసగా 6,4 కొట్టాడు. అయితే ఆ తర్వాత రెండు బంతులను శ్రీశాంత్ డాట్ బాల్స్ వేసి గంభీర్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసాడు.గంభీర్ శ్రీశాంత్ వైపు కోపంగా చూస్తూ వెంటనే రియాక్షన్ ఇచ్చాడు. ఇంతలో శ్రీశాంత్ దగ్గరికి రావడంతో మాట మాట పెరిగిపోయింది. అంపైర్లు సర్ది చెప్పడంతో ఇన్నింగ్స్ కొనసాగింది.
2013లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై పలువురు మాజీ క్రికెటర్లు, జట్టు యజమానులు అరెస్టయ్యారు. శ్రీశాంత్, చవాన్, చండిలా వంటి ఆటగాళ్లను అరెస్టు చేయడంతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK), రాజస్థాన్ రాయల్స్ (RR) జట్లపై రెండేళ్లు నిషేధం విధించారు.
S Sreesanth on Gautam Gambhir:
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 7, 2023
"He kept calling me a fixer".pic.twitter.com/qPtSdEXTjp