ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభమైంది. దుబాయ్‌లోని కోకోకోలా ఎరెనా వేదికగా జరుగుతున్న ఈ వేలంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, ఓపెనర్ ట్రావిస్ హెడ్ ను సన్ రైజర్స్ జట్టు 6 కోట్ల 80 లక్షలకు దక్కించుకుంది. మిడిల్ ఆర్డర్ బాగానే ఉన్నా.. సరైన ఓపెనర్ లేక ఇబ్బంది పడుతున్న SRH హెడ్ ను తీసుకొని టాప్ ఆర్డర్ ను పటిష్టం చేసుకుంది.
2023 లో సన్ రైజర్స్ జట్టులో మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ విఫలమయ్యారు. మధ్యలో బ్రూక్ ను ప్రయోగించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. మిడిల్ ఆర్డర్ లో త్రిపాఠి, మార్కరం, క్లాసన్ లాంటి ప్లేయర్లతో పటిష్టంగా కనబడుతున్న హైదరాబాద్ జట్టు హెడ్ లాంటి స్టార్ ఆటగాడు రావడంతో టైటిల్ పై దుర్బేధ్యంగా కనిపిస్తుంది. అభిషేక్ శర్మ లేదా మయాంక్ అగర్వాల్ తో హెడ్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఇటీవలే భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ లో హెడ్ భారీ సెంచరీతో ఆస్ట్రేలియాకు వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.
2023 లో సన్ రైజర్స్ జట్టు పేలవ ఆటతీరును ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు మ్యాచ్ ల్లోనే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. జట్టు ఓటమికి ప్రధాన కారణాల్లో ఓపెనింగ్ కూడా ఒకటి. 2024 హెడ్ ను తీసుకోవడంతో ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కనిపిస్తుంది. టీ20ల్లో హెడ్ కు మంచి రికార్డ్ లేకపోయినా తనదైన రోజున ఓపెనర్ గా విధ్వంసకర ఇన్నింగ్స్ లు ఆడుతూ మ్యాచ్ విన్నర్ గా మారతాడు.
Travis Head sold to SRH for 6.8 crore. pic.twitter.com/oxWpDuLPLr
— Johns. (@CricCrazyJohns) December 19, 2023