ఆర్జీవీ(RGV) సినిమా నగ్నం మూవీతో హీరోయిన్గా పరిచయమైన నటి శ్రీ రాపాక( Sri Rapaka). ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఫ్యాషన్ డిజైనర్‌గానూ కొనసాగుతోంది. ఆర్జీవీ పుణ్యమా అని ఓ సినిమాలో నటించింది. ఆ తర్వాత బిగ్‌బాస్‌లోనూ పాల్గొంది. గతంలో ఆమె బోల్డ్ ఇంటర్వ్యూలు ఇంటర్నెట్ను ఊపేశాయి.
చాలాకాలంగా అడ్రస్ లేకుండా పోయిన శ్రీ.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొంటే తప్పేంటి? అంటూ తనదైన స్టైల్లో మాట్లాడింది. అమ్మాయిలు ఈ విషయంపై ముందే ఓ క్లారిటీతో ఉండాలని తన స్నేహితురాలి స్టోరీని ఉదాహరణగా చెప్పింది.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలకు కొందరు మద్దతునిస్తున్నారు. మరికొందరు మాత్రం పాపులారిటీ కోసమే ఇలాంటి కామెంట్స్ చేస్తుందని అంటున్నారు.