హిట్‌‌‌‌‌‌‌‌3’లో చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ చేశా:శ్రీనిధి శెట్టి

హిట్‌‌‌‌‌‌‌‌3’లో చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ చేశా:శ్రీనిధి శెట్టి

‘హిట్‌‌‌‌‌‌‌‌3’లో చాలా ఇంటరెస్టింగ్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్ చేశానని, ఈ సినిమా ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు థ్రిల్లింగ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్ ఇస్తుందని హీరోయిన్ శ్రీనిధి శెట్టి చెప్పింది. నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో  వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. 

ఈ సందర్భంగా శ్రీనిధి శెట్టి చెప్పిన విశేషాలు.

ఇదొక ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్. నిజానికి  ఇలాంటి కథల్లో  హీరోయిన్ పాత్రకు అంత ప్రాధాన్యత ఉండదు. కానీ డైరెక్టర్ శైలేష్ కొలను బ్రిలియంట్ రైటర్.  హిట్, హిట్ 2 సినిమాలు గమనిస్తే హీరోయిన్ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కూడా  చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇందులోనూ నా పాత్రను ఇంకా బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రాశారు. కథలో కనెక్షన్ ఉండేలా నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డిజైన్ చేశారు. మృదుల అనే పాత్రలో కనిపిస్తా. అర్జున్ సర్కార్ పాత్రలో నాని నటించారు. ఆయనది ఇంటెన్స్ వైలెన్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన క్యారెక్టర్.  మృదుల మాట తప్ప అతను మరెవరి మాట కేర్ చేయడు. నాని గారితో వర్క్ చేయడం వండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫుల్ ఎక్స్‌‌‌‌‌‌‌‌పీరియెన్స్.  ఇందులో నా పాత్ర కోసం వేరొకరితో డబ్బింగ్ చెప్పించారు. అయితే డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గారిని రిక్వెస్ట్ చేసి నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా.  నేను చేసిన ఫస్ట్ తెలుగు సినిమాకి నా వాయిస్ ఉండడం చాలా ఆనందంగా అనిపించింది. ఓ కన్నడ అమ్మాయిలా కాకుండా తెలుగు అమ్మాయిలానే డబ్బింగ్ చెప్పాను. ‘కేజీఎఫ్’ తర్వాత కూడా నేను దాదాపు వైలెన్స్ ఉన్న సినిమాలే చేశా. అందులో యష్ డైలాగ్ చెప్పినట్టుగా ‘ఐ డోంట్ లైక్ వైలెన్స్, బట్ వైలెన్స్ లైక్స్ మీ’ అన్నట్టుగా నాకు అలాంటి జానర్స్‌‌‌‌‌‌‌‌లోనే ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో ‘తెలుసు కదా’ అనే మూవీ చేస్తున్నా. ఇక ‘రామాయణం’లో సీత క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిజెక్ట్ చేశానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. సీత పాత్ర కోసం ఆడిషన్ ఇచ్చిన మాట వాస్తవమే. ఆ తర్వాత వాళ్ళ నుంచి నాకు ఎలాంటి కాల్ రాలేదు. అలాంటి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని రిజెక్ట్ చేసే అంత పెద్ద యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని కాదు నేను’’.