ఉన్నత విద్య అభివృద్ధికి కృషి

ఉన్నత విద్య అభివృద్ధికి కృషి

బాన్సువాడ, వెలుగు: బాన్సువాడ నియోజకవర్గంలో ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం బాన్సువాడ ఎస్ఆర్ఎన్​కే  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు.  25 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఎస్ఆర్ఎన్ కే డిగ్రీ కళాశాలలో 13 వేల మంది విద్యార్థులు చదువుకోగా, 10 వేల మందికి ఉద్యోగాలు పొందారన్నారు. ఉన్నత విద్యా శాఖ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక సంకల్పంతో కళాశాల ఏర్పాటు కావడంతోపాటు అభివృద్ధి చెందిందన్నారు.  అధ్యాపకులు, విద్యార్థులు కష్టపడితేనే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. 

 జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ బాన్సువాడ లో ఎస్ఆర్ఎన్ కే కళాశాల అభివృద్ధి కి ఎమ్మెల్యే పోచారం ఎంతో కృషి చేశారన్నారు. స్థల  దాత అయిన ఖేడియా వల్లే ఇంత గొప్ప కళాశాల ఏర్పాటైందని ప్రశంసించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కళాశాల అభివృద్ధి కి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు. అనంతరం కశ్మీర్ లో ఉగ్రదాడి మృతులకు సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.  పలువురు ప్రముఖులను సన్మానించారు.  తెలుగు లో పీహెచ్ డీ చేసిన అఫ్రీన్, కవులపై పరిశోధనాత్మకంగా రాసిన పుస్తకాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​రెడ్డికి అంకితం చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, పోచారం సురేందర్ రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి,  ఖేడియా మనుమడు తదితరులు పాల్గొన్నారు.