హైదరాబాద్, వెలుగు: సర్జికల్ రోబోటిక్ సిస్టమ్ డెవలపర్ అయిన ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఎస్ఎస్ఐ మంత్ర 3 రోబో సిస్టమ్‌ను ప్రారంభించింది. దీనితో తక్కువ ధరలకే డాక్టర్లు ఆపరేషన్లు చేయవచ్చని తెలిపింది. ఇది టెలిసర్జరీలో భారతదేశపు తొలి మానవ పరీక్షను పూర్తి చేసింది. మంత్ర 3తో అత్యంత కచ్చితత్వంతో ఆపరేషన్ చేయవచ్చని సంస్థ తెలిపింది.
దీనివల్ల రోగికి మేలు జరుగుతుందని పేర్కొంది. ఈ రోబోకు సన్నని చేతులు, 3డీ హెడ్సెడ్, 4కే విజన్ ఉంటాయి. దీంతో సర్జన్లు సులువుగా ఆపరేషన్లు చేయవచ్చు. ఎయిర్‌టెల్ ఫైబర్‌ఆప్టిక్ నెట్‌వర్క్‌తో ఇది 5 కిలోమీటర్ల దూరంలో విజయవంతంగా టెలీ సర్జరీ చేసింది.