
పాన్‌గల్, వెలుగు: పేదల కడుపు నింపేందుకే సన్న బియ్యం ఇస్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం పాన్‌గల్ మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్ తండా, గోప్లాపూర్, అన్నారంలలో సన్న బియ్యం పంపిణీ చేశారు. అర్హులకు ఎవరికైనా రూ.2 లక్షలలోపు రుణమాఫీ కాకున్నా, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రూ.500కే సిలిండర్ రానివారు దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు. అడిషనల్కలెక్టర్లు వెంకటేశ్వర్లు, యాదయ్య, ఆర్డీ వో సుబ్రమణ్యం, పీడీ డీఆర్ డీవో ఉమాదేవి, డీఎస్వో విశ్వనాథ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్ధన్ సాగర్ పాల్గొన్నారు.
ఉప్పునుంతల, వెలుగు: రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం ఇవ్వడం హర్షణీయమని మాజీ ఎంపీపీ అరుణ అన్నారు. శుక్రవారం వెల్టూర్, కొరటికల్, తాడూర్ లలో తహసీల్దార్ ప్రమీలతో కలిసి సన్నబియ్యం పంపిణీ చేశారు.
రేవల్లి, వెలుగు: మండల కేంద్రంలోని రేషన్‌షాపులో లబ్ధిదారులకు తహసీల్దార్ లక్ష్మీదేవి శుక్రవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పర్వతాలు, నాయకులు న్నారు.
మద్దూరు, వెలుగు: సన్నబియ్యం పంపిణీ చరిత్రాత్మక నిర్ణయమని మాజీ జడ్పీటీసీ రఘుపతి రెడ్డి అన్నారు. భీంపూర్, ధమ్ గాన్ పూర్, పర్సపూర్, మెడికుంట తండా, పల్లెర్ల గ్రామాల్లో శుక్రవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింలు, నాయకులు పాల్గొన్నారు.